31న 'రజనీ పేరవై'

తన రాజకీయం ప్రవేశం కాలమే నిర్ణయిస్తుందంటూ మరోసారి షాక్‌ ఇచ్చారు తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. సినిమా నటులు రాజకీయాల్లోనూ రాణిస్తారంటూ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. చెన్నై కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో డిసెంబర్‌ 29వ తేదీ శుక్రవారం నాలుగు రోజు కోయంబత్తూరు, ఆరోడ్‌, తిరుప్పూర్‌, వేలూరు జిల్లాలకు చెందిన అభిమానులతో భేటీ అయ్యారు. తల్లిదండ్రులు, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఫ్యాన్స్‌ ను కోరారు. ఉద్బోధించారు. 'రాజకీయాల్లో రావాలంటే కాలం, సమయం ముఖ్యం. మొన్న శివాజీ గణేశన్‌, నిన్న నేను, రేపు మరొకరు. కాలమే అన్నింటికి సమాధానం చెబుతుంది. ఇంకా రెండు రోజులే మిగిలి ఉంది. మిమ్మల్ని మిస్‌ అవుతున్నాను. కానీ కాలంతో పాటు ప్రయాణించాల్సిందే. దేన్నైనా కాలమే నిర్ణయిస్తుందని రజనీకాంత్‌ అన్నారు. ఒకప్పుడు ఎంజీఆర్‌ నటుడైనా కూడా రాజకీయాల్లో నిబద్దతతో రాణించారు. ఇప్పుడు పాత తరం మారింది. అంతా కొత్త తరానిదే. మళ్లీ మళ్లీ నేను చెప్పేది ఒకటే. ఇవన్నీ పక్కన పెడితే ముందు విూ తల్లితండ్రులు, కుటుంబం, జీవనంపై దృష్టిసారించండ'ని అభిమానులకు హితబోధ చేశారు. కాగా, 'రజనీ పేరవై' (రజనీ సమాఖ్య) పేరుతో సంస్థను ఏర్పాటుచేసి ఆయన రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది. డిసెంబర్‌ 31వ తేదీన పేరవైని ప్రకటిస్తారని అభిమానులు భావిస్తున్నారు.

Comments