ఏప్రిల్‌ 12న 'కృష్ణార్జున యుద్ధం'

హైదరాబాద్‌: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం'. మేర్లపాక గాంధీ ఈ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గరపాటి, హరీశ్‌ పెద్ది నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాను 2018 ఏప్రిల్‌ 12న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఈరోజు ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ఇందులో నానికి జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తున్నట్లు తెలుస్తోంది. హిప్‌హాప్‌ తమిళ స్వరాలు సమకూరుస్తున్నారు. నాని నటించిన 'ఎంసిఎ' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది. వేణు శ్రీరామ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో నానికి జోడీగా సాయిపల్లవి నటించింది. 'ఎంసిఎ'తో పాటు ఈ ఏడాది నాని నటించిన 'నేను లోకల్‌', 'నిన్ను కోరి' సినిమాలు కూడా ఘన విజయాలు అందుకున్నాయి.

Comments