100 ఎంబీపీఎస్‌ స్పీడుతో దున్నేసుకోవచ్చు

త్వరలో జియో ఫైబర్‌..! 

2017లో జియో సృష్టించిన సంచలనం ఇంతా అంతాకాదు. జియో ధాటికి అన్ని కంపెనీలు దిక్కుతోచని పరిస్థితికి చేరుకున్నాయి. పోటీ పడుతూనే వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా జియో ముందు నిలబడలేకపోతున్నాయి. ఇప్పుడు తాజా జియో ఫైబర్‌ తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. 2018 కానుకగా ఇది త్వరలోనే అడుగుపెట్టనుంది. ప్రస్తుతం రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ కమ్యూనికేషన్‌కు చెందిన ఆస్తులను కొనుగోలు చేయడంలో పరిశ్రమిస్తుంది. ఈ ఆస్తులు కొనుగోలు కాగానే? జియోఫైబర్‌ లాంచ్‌ డేట్‌ను ప్రకటిస్తుందని టెక్‌ వర్గాలు వెల్లడిస్తున్నాయి. జియోకు, ఆర్‌కామ్‌కు మధ్య జరుగుతున్న ఈ డీల్‌లో ఆర్‌కామ్‌కు చెందిన 850, 900, 1800, 2100 మెగాహెడ్జ్‌ బ్యాండ్స్‌లో 122.4 యూనిట్ల 4జీ ఎయిర్‌వేవ్స్‌ను జియో కొనుగోలు చేస్తుంది. 1,78,000 కిలోమీటర్ల ఫైబర్‌, 43వేల టవర్స్‌ కూడా ఈ డీల్‌ లో భాగంగా తెలుస్తుంది. ఇప్పటికే వైర్‌లెస్‌ మార్కెట్‌లో తనదైన ముద్ర వేసుకున్న జియో, 1,78,000 కిలీవిూటర్లకు పైగా ఫైబర్‌ నెట్‌వర్క్‌తో భవిష్యత్తులో మరింత దూసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో భారతదేశంలో ఇంటర్నెట్‌ మార్కెట్‌ పూర్తిగా తన చేతుల్లో ఉండేలా ప్లాన్‌ చేసుకుంటుంది. కాగా ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఖరీదైనవే కాకుండా ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించాల్సి ఉంటుంది. ఫైబర్‌ నెట్‌వర్క్‌ లేకుండా? జియోఫైబర్‌ 100ఎంబీపీఎస్‌ స్పీడును ఆఫర్‌ చేయలేదు. ప్రారంభంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిరూపించుకోవాలంటే, జియో తప్పకుండా తన ఫైబర్‌ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించాల్సి వస్తుంది. అంతకముందు రిపోర్టుల ప్రకారం జియోకు 3,00,000 కిలోమీటర్ల ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఉంది. ఆర్‌కామ్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను దక్కించుకున్న తర్వాత ఎక్కువ ప్రాంతాల్లో, చాలా వేగవంతంగా దీన్ని లాంచ్‌ చేయడానికి వీలవుతుందని టెక్‌ వర్గాలు వివరిస్తున్నాయి. ఉచితంగా మూడు నెలల ట్రయల్‌ నేపథ్యంలో జియో ఎంపికచేసిన ప్రాంతాల్లో జియోఫైబర్‌ను అందుబాటులో ఉంచింది. జియోఫైబర్‌ ద్వారా కనీసం 100 ఎంబీపీఎస్‌ స్పీడుతో ఇంటర్నెట్‌ను దున్నేసుకోవచ్చు. 
                                                                                                                          - పి.వేణుగోపాల్‌

Comments

  1. Good information. If it is implemented, state finer net also fall down.

    ReplyDelete

Post a Comment