బాబూ.. చిట్టీ...!

40 ఇయర్స్‌ ఇండస్ట్రీ ఇక్కడ...అందుకే ఒక్కడ్ని ఢీకొట్టేందుకు మోడీ, పవన్‌ కల్యాణ్‌తో జత కట్టారు ఈ సీనియర్‌ నేత. స్కెచ్‌ అనుకున్నట్టే రీచ్‌ అయింది. కేవలం ఒక్క శాతంతో వైఎస్సార్‌ సీపీని వెనక్కు నెట్టి విజయం సాధించారు చంద్రబాబు. రాజకీయాలు అన్నాక ఎలా గెలిచామన్నది కాదు గెలిచామా లేదా అన్నదే ముఖ్యం. ఓకే..ఓకే..కమలనాథులతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన టీడీపీ...టీడీపీ మాయలో జనసేనాని ఇలా ముగ్గురూ తమకు ఎదురులేని పరిస్థితులను ఏర్పాటు చేసుకున్నాయి. టీడీపీకి డ్యామేజీ జరిగినప్పుడల్లా అత్యధిక ప్రజాదారణ కలిగిన పవన్‌ కల్యాణ్‌ ఏదో విషయంతో జనంలోకి రావడం...సమస్యను డైవర్ట్‌ చేయడం ఇలా టీడీపీని కాపాడుతూ వచ్చాడు. ఇప్పుడా ఆ మూడు పార్టీల మధ్య ప్రత్యేక హోదా చిచ్చు రేగింది. స్పెషల్‌ స్టేటస్‌ వద్దు..ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని అసెంబ్లీ తీర్మాణం చేసిన చంద్రబాబు..రాష్ట్రానికి వరదలా నిధులు వచ్చేస్తాయని జనాల్ని నమ్మించారు. అమరావతి రాజధాని నిర్మాణం ప్రపంచలోనే మేటిగా నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. ఇలా అన్నింటా నెంబర్‌ వన్‌ అంటూ ప్రగల్భాలు పలికారు. ప్రజలు నిలదీయడంతో బీజేపీ, టీడీపీల కాపురం బెడిసికొట్టింది. తప్పని సరి పరిస్థితుల్లో మంత్రులను రాజీనామాలు చేయించి ప్రత్యేక హోదా కావాలంటూ కొత్త పల్లవి అందుకుంది. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఇది నిజంగా ఘోర ఓటమే. అసెంబ్లీ రికార్డుల్లో ప్రత్యేక ప్యాకేజీపై ధన్యవాదాలు తెలుపుతూ తీర్మాణం ఉంది. ఇప్పుడు అదే అసెంబ్లీలో మాట మార్చి ప్రత్యేక హోదా కావాలని కన్నీళ్లు పెట్టుకున్న పుటేజులూ ఉన్నాయి. 40 ఏళ్ల ఇండస్ట్రీలో బాబు ఇలా తడబడడం ఇదేనేమో. ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వకపోతే ఏం జరుగుతుందో బాబు గ్రహించే యూ టర్న్‌ తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. సెంట్‌మెంట్‌ ప్రకారం మేం నడుచుకోం అంటూ జైట్టీ స్పష్టంగా చెప్పినప్పటికీ అసెంబ్లీలో చంద్రబాబు సెంట్‌మెంట్‌ సీన్‌ క్రియేట్‌ చేయడం చర్చనీయాంశమైంది. ఏదో రకంగా ప్రజలనుంచి సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నట్టు అర్థమవుతోంది. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌ ఇవ్వరని తెలిసి కూడా చంద్రబాబు అండ్‌ కో ఆడిన నాటకంపై ప్రజలు గుర్రుగా ఉన్నారు. ప్రత్యేక హోదా కోసం కన్నీళ్లు పెట్టుకున్న మాత్రానా పార్టీ నేతల నుంచి సానుభూతి పొందవచ్చేమో గానీ ప్రజల నుంచి కాదని ఇప్పటికే సోషల్‌ మీడియా వైరల్‌ అవుతుంది.
రైతుల ఉద్యమం ఎంత స్ఫూర్తిదాయకంగా జరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం రైతుల కాళ్ల దగ్గరకువచ్చి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఏం..చిత్తశుద్ధి ఉంటే అలాంటి ఉద్యమం ఒకటి చేయవచ్చు కదా...వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీలను అభినందిస్తూ కూర్చుంటే పనవుతుందా? ఎంపీ శివప్రసాద్‌ ఉన్న పరువును కూడా ఢిల్లీ తీసేస్తున్నాడని సోషల్‌ మీడియా గగ్గోలు పెడుతున్నా పట్టదా. నిరసన ఒక్కో రోజు ఒక్కో విధంగా నిర్వహించడం తప్పులేదు. కానీ అదే పనిగా వేషధారణలతో నిరసన తెలపడం మీడియా కవరేజ్‌ కోసమేనని శివప్రసాద్‌ చేస్తున్న నిరసన అర్థమవుతుంది. ఆయన వివిధ వేషధారణలో అతని ప్రయత్నం చేస్తుంటే పక్కనే ఉన్న మిగిలిన ఎంపీలు ముసిముసినవ్వులు నవ్వుకోవడం చిత్రం కాకపోతే మరేంటి విచిత్రంగా..చంద్రబాబు ఇది కూడా గమనించండి. 
హైదరాబాద్‌ను ఒంటిచేత్తో అభివృద్ధి చేశానని చెప్పే చంద్రబాబు ఇంత నిస్సాహయంగా కన్నీళ్లు పెట్టుకోవడం..భావోద్నేగానికి గురవ్వడం..డిప్రెషన్‌లో ఉండడం నిజంగా నిజంగా ఆ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. మరి 14న జరిగే జనసేన పార్టీ సభలో వవర్‌ స్టార్‌ ఏ విధంగా రాయాక్ట్‌ అవుతాడో కూడా వేచి చూడాలి. పవన్‌ కూడా ఇపుడు బాబు పక్కనే ఉంటాడా? లేదా మోడీ డైరక్షన్‌లో నడుస్తాడో రే
టి సభలో తేలిపోతుంది. అప్పుడు బాబు పరిస్థితి ఏంటి? అనే దానిపై ఇప్పుడు చర్చ మొదలైంది.

Comments