భాగమతి స్కోరు ఇప్పటికి రూ.50 కోట్లు

భాగమతిగా అనుష్క సత్తా చాటుతోంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో భారీ ఓపెనింగ్స్‌తో పాటు మంచి టాక్‌తో రోజురోజుకు థియేటర్ల సంఖ్య పెంచుకుంటూ పోతోంది. దేశవ్యాప్తంగా 1200 థియేటర్లలో జనవరి 26న విడుదలైన భాగమతి ఫిబ్రవరి 1వ తేదీ నాటికి రూ.50 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. మహిళా ప్రాధాన్య చిత్రంగా ఈ సినిమా ఆ విభాగంలో ఈ స్థాయి సాధించటం ఆ సినిమా కథానాయకి అనుష్కా షెట్టి సాధించిన ఘన విజయమేనని చెపు తున్నారు. 2018లో తొలి ఘన విజయం సాధించిన టాలీవుడ్‌ సినిమాగా ఈ విజయాన్ని టాలీవుడ్‌ ట్రేడ్‌ పండితులు విశ్లేషిస్తున్నారు. త్రిభాషా చిత్రం తెలుగు తమిళ మళయాల భాషల్లో ఒకేలాగా అద్భుతంగా ఫేర్‌ చేయటం భాగమతి-టీం కు ఆనందాన్ని ఉత్సాహాన్ని పంచుతుంది. సోమవారం నుంచి వసూళ్లు చాలా వరకు తగ్గిపోవచ్చని భావించిన సినీ పండితులు ఊహించినంతగా కాకుండా కొద్దిగా తగ్గినా వారం మధ్యలో కూడా అద్భుత ఫర్ఫార్మెన్స్‌ చేస్తూనే ఉంది. నూతన సంవత్సరంలో బడా నటుల సినిమాలన్నీ పూర్తిగా డీలాపడి డిస్ట్రిబ్యూటర్లను నిలువునా ముంచేసి పండుగ సమయంలో ప్రేక్షకులకు వినోదం లేకుండా చేశాయి. చిన్న సినిమాలు కూడా గత సంవత్సర సంక్రాంతి రోజుల్లో లాగా ఫేర్‌ చేయలేదు. డీలాపడ్ద టాలీవుడ్‌ కి నూతన జవసత్వాలందించి చివరివారానికి గాని భాగమతి ప్రాణం పోసింది. మార్కెట్‌ ను నిలబెట్టింది. తొలి మూడు రోజుల్లోనే 80% ఇన్వెస్టర్ల మనీ ఈ సినిమా తిరిగిచ్చేసిందని ఫిబ్రవరి తొలివారానికి లాభాలు పండించబోతుందని విశ్వసిస్తున్నారు. ఇదే సినిమా సంక్రాంతి పండగకు విడుదలై ఉంటే ఆ విజయం కలక్షణ్లపరంగా మరింత అద్భుతంగా ఉండేదని అంటున్నారు. యుఎస్‌ బాక్స్‌ ఆఫీస్‌ ఇప్పటికే ఒక మిలియన్‌ మార్క్‌ దాటిందని వార్తలు వస్తున్నాయి.

Comments