మిత్రుల మధ్య కోల్డ్‌వార్‌?

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార టీడీపీకి మిత్ర పక్షమైన కమలాధుల మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది. మాటకు మాటకు..విమర్శకు విమర్శ అన్న రీతిలో సాగుతోంది. ఇటీవల కాలంలో కేంద్రంలో చంద్రబాబును పట్టించుకునే వారు లేకపోవడంతో ఏం పాలుపోవడం లేదు. మిత్రులుగా ఉన్న కమలనాధులు కూడా రివర్స్‌ గేర్‌లో వెళుతున్నారు. హైదరాబాద్‌ అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ఉందనడంలో సందేహం లేదు. ఇటీవల ట్రంప్‌ తనయ హైదరాబాద్‌ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు ఆహ్వానం పలకుండా ఉన్నారంటే ఇదంతే కమలనాధుల స్కెచ్‌ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కోడలు బ్రాహ్మణి ఆహ్వానం పలికారు గానీ..బాబును పక్కన పడేశారు. అలాగే ప్రపంచ తెలుగు మహాసభలకు బాలయ్యను పిలిచి బాబును పట్టించుకోకపోవడం కూడా రాజకీయ పరిణామాల్లో భాగమేనని అర్థం చేసుకోవచ్చు..బీజేపీ కూడా బాబు హవాకు చెక్‌ పెట్టేందుకు ఎప్పట్నించో ప్రయత్నిస్తూనే ఉంది. మోడీకి కూడా చంద్రబాబుపై లవ్‌ తగ్గిపోయింది. రాష్ట్రంలో అభివృద్ధి నత్తనడకన సాగుతుండడం, అనవసర ఆర్భాటాలకు పెద్దపీట వేస్తుండడంతోపాటు ప్రజల్లో క్రమంగా టీడీపీ గ్రాఫ్‌ తగ్గుతుండడంతో బీజేపీ సీరియస్‌గా ఆలోచిస్తోంది. అటు పవన్‌ కల్యాణ్‌ కూడా మోడీ పట్టించుకోకుండా...సొంతంగా సత్తా చాటాలా? లేక వైఎస్సార్‌ సీపీని కలుపుకొనిపోవాలా? అన్న సందిగ్ధంలో ఉంది. ఈ విషయం పక్కన పెడితే బీజేపీ నాయకులు చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్‌ చేస్తున్న సంఘటనలు రాజకీయ ఊహాగానాలకు తెరలేపుతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వంపై బిజేపి నేతల ఆరోపణలు, పోలవరం విషయంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారా?? గుజరాత్‌లో ఈజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అందుకే బాబు డుమ్మా కొట్టారా?.? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపిలో ప్రస్తుతం మిత్రపక్షాల మధ్య పాలిటిక్స్‌ హాట్‌ హాట్‌ గా కొనసాగుతున్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో రెండు పార్టీలు జత కడతాయా అనే పశ్న తలెత్తుతోంది. 
ఆంధ్రప్రదేశ్‌ లో మిత్రపక్షాలైన టీడీపీ, బీజేపీలు కలిసి ప్రభుత్వ భాగస్వాములుగా కొనసాగుతున్నారు. అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా టీడీపీ ఎంపిలు కూడా కేంద్ర మంత్రుల ¬దాలో కొనసాగుతున్నారు. 2014 ఎన్నికల నుండి కలిసి ముందుకు నడుస్తున్న ఈ ఇద్దరు మిత్రుల మధ్య ఇటీవల కాలంలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో అధికారంలో వున్న టీడీపీ ప్రభుత్వంపై, మిత్రపక్షమైన బిజేపికి చెందిన నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బిజేపి ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, మాధవ్‌ లు టీడీపీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేయటంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందచేస్తున్న చంద్రన్న పథకంలో నాసిరకం సరుకులు అందిస్తున్నారని విమర్శిస్తున్నారు. చాలా విషయాల్లో బాబు వ్యతిరేకంగా కమలనాథులు విమర్శలు గుప్పిస్తునే ఉన్నారు. 

                                                                                                                             - పి.వేణుగోపాల్‌

Comments